హిందూపురంలో బాలకృష్ణ పర్యటన - మార్మోగిన జై బాలయ్య నినాదాలు - Andhra Pradesh
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 7, 2024, 6:41 PM IST
TDP MLA Nandamuri Balakrishna Visit to Hindupur Constituency: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో నాలుగు రోజుల పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హిందూపురం చేరుకున్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని చౌడేశ్వరి కాలనీలోని బాలకృష్ణ నివాసం వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. నాలుగు రోజుల పాటు హిందూపురం గ్రామీణ మండలంలోని పంచాయతీల వారీగా, మున్సిపల్ పరిధిలోని వార్డుల వారీగా కార్యకర్తలతో తెలుగుదేశం పార్టీ అంతర్గత సమీక్ష సమావేశాలు బాలయ్య నిర్వహించనున్నారు.
అనంతరం శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో మైనార్టీ నాయకుడు ఇంట జరిగిన వివాహ వేడుకకు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హాజరయ్యారు. హిందూపురం తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకుడు దాదా పీర్ సోదరి వివాహ వేడుకకు బాలకృష్ణ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా పలువురు మైనార్టీ నాయకులు నందమూరి బాలకృష్ణను సత్కరించి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. బాలయ్య రాకతో కల్యాణ మండపం మొత్తం జై బాలయ్య నినాదంతో మార్మోగింది.