వైసీపీలోని గ్రూపు తగాదాల వల్లే మంత్రి రజని కార్యాలయంపై దాడి: టీడీపీ నేతలు - TDP attack on YCP office
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 1, 2024, 10:21 PM IST
TDP Leaders Reaction on Attack on YCP Office: గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఇన్‌ఛార్జి, మంత్రి విడదల రజిని కార్యాలయంపై దాడి ఘటనలో మంది తెలుగుదేశం కార్యకర్తల్ని పట్టాభిపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసులు నమోదు చేశారు. నిందితులను వైద్య పరీక్షల కోసం జీజీహెచ్‌కు తరలిస్తున్న సమయంలో మాజీ మంత్రి నక్కా ఆనందబాబుతోపాటు తెలుగుదేశం, జనసేన నేతలు వారిని పరామర్శించారు. రాత్రి ఏం జరిగిందో ఆరా తీశారు. పార్టీ తరఫున న్యాయసహాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. అసలేం జరిగిందో తెలియకుండా పోలీసులు గందరగోళం సృష్టిస్తున్నారని నక్కా ఆనందబాబు విమర్శించారు.
గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీలోని గ్రూపు తగాదాల వల్లే మంత్రి రజని కార్యాలయంపై దాడి జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. పార్టీ తరపున న్యాయసహాయం అందిస్తామని, ధైర్యంగా ఉండాలని సూచించారు. అనంతరం మాట్లాడిన ఆనంద బాబు చంద్రమౌళినగర్లోని ఎన్టీఆర్ విగ్రహానికి కొత్త సంవత్సరం సందర్భంగా నివాళులు అర్పించేందుకు టీడీపీ కార్యకర్తలు వెళ్లారని తెలిపారు. అయితే అక్కడ మంత్రి కార్యాలయం ఏర్పాటు పేరుతో పోలీసులు బారికేడ్లు అడ్డం పెట్టి ఆంక్షలు విధించారన్నారు. ఈ సందర్భంలో గొడవ జరిగి రజనీ ఆఫీస్‌పై రెండు రాళ్లు పడ్డాయని దానికి టీడీపీ వారిని అరెస్టు చేయటం ఏమిటని ప్రశ్నించారు.