Smuggling Rare Coral Plants in Srisailam: అరుదైన సముద్ర జాతి ఇంద్రజాల, మహేంద్రజాల మొక్కలను అక్రమంగా తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను శ్రీశైలంలో డీఐర్ఐ అధికారులు అరెస్టు చేశారు. అంతరించిపోతున్న జాతుల్లో ఉన్న ఇంద్రజాల, మహేంద్రజాల మొక్కలను బ్లాక్, సాఫ్ట్ కోరల్స్‌గా (Coral Plants) పిలుస్తారు. శ్రీశైలం, ఒంగోలు ప్రాంతాల్లో ఈ మొక్కలను విక్రయిస్తుండగా ఇద్దరిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 9.8 కిలోల ఇంద్రజాల, మహేంద్ర జాల మెుక్కలను, 6 శంఖువులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల సమాచారంతో ఒంగోలులో ఈ మొక్కలను సరఫరా చేస్తున్న మరో వ్యక్తిని అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 6.64 కిలోల డెడ్ బ్లాక్, డెడ్ సాఫ్ట్ కోరల్స్ స్వాధీనం చేసుకున్నారు.
ఒక్కరోజులో లక్షా 20 వేల బీర్లు లేపేశారు - ఆ రెండు జిల్లాల్లో రూ.36 కోట్ల ఆదాయం