TDP Leaders Rally Against CBN Arrest: చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా విశాఖలో టీడీపీ నేతల ర్యాలీ.. అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు - విశాఖ జిల్లా తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 7, 2023, 3:06 PM IST
TDP Leaders Rally Against CBN Arrest : చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా విశాఖ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి ఆ పార్టీ నేతలు మెరుపు నిరసన చేశారు. ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు భారీ స్థాయిలో టీడీపీ నేతలు ర్యాలీ నిర్వహించారు. బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద రోడ్డుపై బైటాయించిన టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పార్టీ కార్యకర్తలకు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మరి కొందరు అంబేద్కర్ విగ్రహం దగ్గరకు చేరుకోవడానికి ప్రయత్నం చేశారు. ఈ సమయంలో పోలీసులు సృష్టించిన అడ్డంకులను దాటుకోని టీడీపీ నేతలు అంబేద్కర్ విగ్రహానికి చేరుకున్నారు. టీడీపీ నేతలు చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. విశాఖ టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు, ఎమ్మెల్సీలు దువ్వారపు రామారావు, వేపాడ చిరంజీవి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు వంగలపూడి అనిత, మాజీ ఎమ్మెల్యేలు రామానాయుడు నిరసనలో పాల్గొన్నారు.