Damaged Roads: రోడ్డుపై గుంతలో చేపలు పడుతూ.. టీడీపీ వినూత్న నిరసన - bad roads in andhra pradesh

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 26, 2023, 9:16 PM IST

TDP Leaders Protest for Roads: కృష్ణా జిల్లాలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా తయారైంది. ఎక్కడ చూసినా పెద్ద పెద్ద గుంతలతో రహదారులు దర్శనమిస్తున్నాయి. అలాంటి రహదారులపై ప్రయాణమంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. చిన్నపాటి వర్షాలు పడినా రోడ్లు చెరువుల్లా మారిపోతున్నాయని స్థానికులు వాపోతున్నారు. దీనివల్ల ఆయా మార్గంలో ప్రయాణించేటప్పుడు గుంతలు ఎక్కడ ఉన్నాయో తెలియక తరచూ.. ప్రమాదాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడికైనా వెళ్లాలంటే ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకోవాల్సి వస్తోందని వాపోతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు అవనిగడ్డ మండలం అశ్వరాపాలెం ప్రాంతంలో రోడ్లపై ఉన్న భారీ గుంతల్లో వరద చేరింది. దీంతో రహదారి నిర్మాణం చేపట్టాలని టీడీపీ కార్యకర్తలు నిరసన చేపట్టారు. రహదారి గుంతల్లో వలలతో చేపలు పడుతూ తమ ఆవేదన వ్యక్తం చేశారు. తమ గ్రామంలో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు దీనిపై స్పందించి వెంటనే తమ ప్రాంతంలో రహదారుల మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.