TDP leaders House Arrest : 'ఇల్లు విడిచి బయటకు వస్తే అరెస్టు చేస్తాం'.. టీడీపీ నేతల ఇళ్ల వద్ద మొహరించిన పోలీసులు - బండారు సత్యనారాయణ తాజా
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 3, 2023, 1:15 PM IST
TDP leaders Nakka Anand Babu and Rajendra Prasad House Arrested: టీడీపీ నేతలు మాజీ మంత్రులైనా నక్కా ఆనంద్‌బాబు, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌లను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. మాజీ మంత్రి బండారు సత్యనారాయణను అరెస్టు చేసి గుంటూరుకు తీసుకు వచ్చిన నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా హౌస్ అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. టీడీపీ శ్రేణులేవరు బయటకు రాకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ప్రస్తుతం సత్యనారాయణ నగరంపాలెం పోలీస్ స్టేషన్లో ఉండగా.. టీడీపీ నేతలు అక్కడికి రాకుండా అంక్షలు విధించారు.
వసంతరాయపురంలోని ఆనంద్ బాబు ఇంటి వద్ద, రింగు రోడ్డులోని ఆలపాటి రాజేంద్రప్రసాద్ నివాసం వద్ద పోలీసులు మోహరించారు. వారిని ఇళ్ల నుంచి బయటకు వస్తే అరెస్టు చేస్తామని పోలీసులు ప్రకటించారు. మరోవైపు నగరంపాలెం పోలీస్ స్టేషన్ వద్ద కూడా పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. అంతేకాకుండా అక్కడి వచ్చిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు, కార్పోరేటర్ బుజ్జిని పోలీసులు అరెస్టు చేశారు. వారు తమ నాయకుడిని పరామర్శించేందుకు వచ్చామని ఎలాంటి ఆందోళన చేయటం లేదని చెప్పినా వినకుండా.. బలవంతంగా వాహనం ఎక్కించి తీసుకెళ్లారని తెలిపారు.