'ముఖ్యమంత్రి జగన్‌కు పిచ్చి ముదిరింది - మానసిక స్థితిపై కేంద్రానికి గవర్నర్ లేఖ రాయాలి' - సీఎం జగన్పై నక్కా ఆనంద్ బాబు ఫైర్
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/03-11-2023/640-480-19932472-thumbnail-16x9-tdp-leaders-fires-on-cm-jagan.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 3, 2023, 4:34 PM IST
TDP Leaders Fires on CM Jagan: ముఖ్యమంత్రి జగన్‌కు పిచ్చి ముదిరిందని.. తెలుగుదేశం నేతలు విమర్శించారు. జగన్‌కు ముదిరిన పిచ్చిపై గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరారు. ఎన్నికల్లో ఓటమిని ఊహించే.. భవిష్యత్తులో తనపై పెట్టబోయే కేసులను.. ప్రతిపక్ష నేతపై మోపుతున్నారని ఆరోపించారు. జగన్ అక్రమాలకు సహకరిస్తున్న అధికారులు.. భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదని టీడీపీ నేతలు హెచ్చరించారు. అక్రమ కేసులతో ప్రతిపక్ష నాయకులను వేధిస్తున్న సీఐడీ అధికారులు.. ఛార్జిషీట్లను ఎందుకు దాఖలు చేయడం లేదని ప్రశ్నించారు.
జగన్ పరిపాలనను హేళను చేస్తూ పక్క రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నాయని తెలిపారు. ప్రశాంత్ కిషోర్ సర్వేతో పాటు ఇంటెలిజెన్స్ సర్వేలు, ఇతర సర్వేలు వైసీపీకు సింగిల్ డిజిట్ కూడా రావని తేల్చేయటంతో చేసేది లేక చంద్రబాబుపై కేసుల మీద కేసులు పెడుతున్నాడని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి అధికారం పోవటం, శాశ్వతంగా జైలుకు పోవటం ఖాయమని స్పష్టం చేశారు. మచ్చలేని నాయకుడిగా ఉన్న చంద్రబాబుకు ఏదో రకంగా మసిపూయాలనే రోజుకో అక్రమ కేసు పెడుతున్నారని దుయ్యబట్టారు. ఇసుక, మద్యం కుంభకోణాలపై తెలుగుదేశం పోరాడుతున్నందుకే అక్రమ కేసులు పెట్టారని ఆక్షేపించారు.