TDP Leaders Complaint Against MP Gorantla Madhav: చంద్రబాబుపై రాజకీయ కుట్ర.. ఎంపీ గోరంట్ల సహా వైసీపీ నేతల్ని విచారించాలి: టీడీపీ - ycp MP Gorantla Madhav comments
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 30, 2023, 3:46 PM IST
TDP Leaders Complaint Against MP Gorantla Madhav: '2024లో ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి గారు వస్తారు.. చంద్రబాబు నాయుడు గారు చస్తారు.' అంటూ ఈ నెల 27వ తేదీన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలపై.. తెలుగుదేశం పార్టీ నేతలు అనంతపురం 4వ పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం చంద్రబాబుపై ఎంపీ మాధవ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ కుట్రకు ఊతమిస్తున్నాయని ఆరోపించారు. ఎంపీ వ్యాఖ్యలతో ఏదో జరుగుతోందని అనుమానం వ్యక్తం చేశారు. ఎంపీ మాధవ్‌తో పాటు వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులను అదుపులోకి తీసుకుని విచారించాలని డిమాండ్ చేశారు.
Kalava Srinivasulu Comments: ''ఎంపీ గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలను బట్టి చంద్రబాబుపై రాజకీయ కుట్ర జరుగుతోందన్న అనుమానం నిజమైంది. చంద్రబాబుపై ఎంపీ చేసిన వ్యాఖ్యలపై ఆయనను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టాలి. 11ఏళ్ల నేర చరిత్ర కల్గిన నాయకుడు.. అధికారం చేపట్టి, వ్యవస్థలను మేనేజ్ చేసి, చట్టానికి సమాధి కడుతున్నారు. చంద్రబాబుకు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకే ఆయనను అక్రమంగా అరెస్ట్ చేశారు. పోలీసులు వెంటనే స్పందించి.. ఎంపీ గోరంట్ల మాధవ్‌తో పాటు మరికొంతమంది వైసీపీ ముఖ్య నేతలను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టాలి.'' అని మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు డిమాండ్ చేశారు.