TDP Leaders Agitations : కదిలించిన అభిమానం..! చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా నిరసనలు ఉధృతం - ఆగ్రహ జ్వాలలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 3, 2023, 5:24 PM IST

TDP Leaders Agitations Continues Against Chandrababu Arrest :  తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలు కొనసాగుతున్నాయి. విజయనగరం జిల్లా నెల్లిమర్లలో టీడీపీ మహిళా నేతలు, బొబ్బిలిలో శ్రీశయన సంఘం నాయకులు నిరహార దీక్షలు చేపట్టారు. విజయనగరం మాజీ ఎమ్మెల్యే మీసాల గీత చంద్రబాబుకి మద్ధతుగా విజయనగరం కోటలో సంతకాల సేకరణ చేపట్టింది. 

TDP Cadre Protest in AP Against CBN Arrest : అనకాపల్లి జిల్లా కుసర్లపూడిలో చేపట్టిన సామూహిక దీక్షలో టీడీపీ నాయకుడు బత్తుల తాతయ్య బాబుతో పాటు పలువురు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం అడ్డరోడ్డు నుంచి కామేపల్లి వరకూ ఎమ్మెల్యే గొట్టిపాటి రవి సైకిల్ యాత్ర చేపట్టారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో టీడీపీ నేతలు చెవిలో పూలు పెట్టుకుని దీక్ష చేశారు. చంద్రబాబు, లోకేశ్, నారాయణపై పెడుతున్న అక్రమ కేసులు తొలగించాలని నెల్లూరు మీరామొహిద్దీన్ దర్గాలో తెలుగుదేశం మైనార్టీ నేతలు ప్రార్థనలు నిర్వహించి.. అన్నదానం చేశారు.

చిత్తూరు జిల్లా కుప్పంలో ఎమ్మెల్సీ శ్రీకాంత్ నాయీ బ్రాహ్మణ విభాగ నాయకులతో కలిసి గంగమ్మ ఆలయంలో పూజలు నిర్వహించి మేళతాళాలతో నిరసన తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో టీడీపీ రెడ్ల సంఘం నాయకులు పాల్గొన్నారు. వస్త్ర వ్యాపారుల సంఘం, రైతులు ఎడ్లబండ్లపై వెళ్లి దీక్షకు సంఘీభావం తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.