TDP Leader Vijaykumar on AP Digital Corporation: 'ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ముసుగులో.. జగన్ ప్రభుత్వం రూ.500 కోట్లు లూటీ' - P Digital Corporation news
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 9, 2023, 4:38 PM IST
|Updated : Oct 9, 2023, 5:13 PM IST
TDP Leader Vijaykumar PPT on AP Digital Corporation: ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ ముసుగులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన దుబారా ఖర్చుపై.. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. నాలుగున్నరేళ్లలో సుమారు రూ.500 కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. జగన్ పాలనలో ప్రజల సొమ్ము ప్రచార ప్రకటనల పాలవుతోందని దుయ్యబట్టారు. ప్రభుత్వం కోసం పని చేయాల్సిన డిజిటల్ కార్పొరేషన్.. అధికార పార్టీ కార్యకలాపాలను చక్కబెడుతోందని విజయ్ కుమార్ విమర్శించారు.
Vijaykumar Comments: 'ఏపీ డిజిటల్ కార్పొరేషన్ అడ్వర్‌టైజ్‌మెంట్లతో ప్రజాధనం లూటీ' పేరుతో విజయ్ కుమార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..''జగన్ హయాంలో ప్రజల సొమ్ము ప్రచార ప్రకటనల పాలవుతోంది. ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ముసుగులో జగన్ సర్కార్ నాలుగున్నరేళ్లలో రూ.500 కోట్లు దుబారా చేసింది. డిజిటల్ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వ కార్యకలాపాల ముసుగులో అధికార పార్టీ తన కార్యకలాపాలు చక్కబెట్టుకుంటోంది. ప్రభుత్వం కోసం పని చేయాల్సిన మొత్తం కార్పొరేషన్.. పార్టీ అవసరాలు, ప్రచార పిచ్చికి జగన్ రెడ్డి దుర్వినియోగం చేస్తున్నాడు. ప్రభుత్వానికి బయట సాక్షి మీడియా, లోపల ఏపీ డిజిటల్ కార్పొరేషన్ అనేలా పరిస్థితి తయారైంది. ఈ కార్పొరేషన్ పేరుకే ప్రభుత్వ సంస్థ.. చేసేదంతా జగన్ రెడ్డి భజనే. యూట్యూబ్, గూగుల్ సంస్థలతో పాటు పలు ప్రైవేట్ వెబ్‌సైట్లకు ప్రభుత్వం సొమ్ము చెల్లిస్తూ.. జగన్ రెడ్డిని కీర్తి కండూతి కోసం కార్పొరేషన్ పోటీపడుతోంది. డిజిటల్ కార్పొరేషన్‌లో పని చేసే సిబ్బంది అంతా వైసీపీ సోషల్ మీడియా వారే.'' అని విజయ్ కుమార్ తెలిపారు.