'లేపాక్షి - ఇందు భూముల్లో భారీ కుంభకోణం - దోచుకొన్నవారికే మళ్లీ దోచిపెట్టే కుట్ర' - Lepakshi Indu Land Scam news

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 28, 2023, 4:41 PM IST

TDP Leader Vijay Kumar on Lepakshi-Indu Land Scam: లేపాక్షి-ఇందు భూములకు సంబంధించి.. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్‌ కుమార్ సంచలన విషయాలను ప్రస్తావించారు. వైసీపీ ప్రభుత్వ హయంలో లేపాక్షి- ఇందు భూముల్లో భారీ కుంభకోణం జరుగుతోందని ఆయన ఆరోపించారు. దోచుకొన్నవారికే మళ్లీ దోచిపెట్టి.. రైతుల నోట్లో మట్టికొట్టారని ధ్వజమెత్తారు. లేపాక్షి భూముల కోసం బిడ్డింగ్ చేసిన ఏర్తిన్ ప్రాజెక్ట్స్‌లో కమలాపురం ఎమ్మెల్యే కొడుకు నరేన్ డైరెక్టర్ అని ఆయన పేర్కొన్నారు. ఏర్తిన్ డబ్బు కట్టలేకపోవడంతో ఇప్పుడు సుబ్బా రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి వచ్చారన్న విజయ్ కుమార్.. అంతా ప్రభుత్వ పెద్దల అనుచరులేనని దుయ్యబట్టారు.

Vijay Kumar Comments: ''లేపాక్షి-ఇందు భూముల్లో ఇప్పుడు 2.o, 3.o స్కామ్‌లు జరుగుతున్నాయి. దోచుకొన్నవారికే మళ్లీ దోచిపెట్టి.. రైతుల నోట్లో మట్టికొడుతున్నారు. లేపాక్షి ప్రాంతంలోని రెండు మండలాల్లో ఇందు ప్రాజెక్ట్స్‌కి ఇచ్చిన భూములు రకరకాలుగా చేతులు మారబోతున్నాయి. లేపాక్షి- ఇందు భూముల్లో భారీ కుంభకోణం జరుగుతోంది. ప్రభుత్వ పెద్దల దగ్గరి వాళ్లకు తక్కువ ధరలకే లేపాక్షి-ఇందు భూములను ఇచ్చేస్తున్నారు. 4,197 ఎకరాల ప్రభుత్వ భూమిని బ్యాంకులు గ్యారెంటీగా పెట్టుకుని.. రూ.4000 వేల కోట్లు ఓ కంపెనీకి ఇచ్చాయి. ఆ తర్వాత ఆ కంపెనీ దివాలా తీసింది. దాంతో బ్యాంకులు ఆ కంపెనీ ఆస్తులను వేలం వేస్తూ.. మాకు రూ.4వేల కోట్లు అవసరంలేదు. కేవలం రూ.477 కోట్లు చెల్లిస్తే చాలు.. ఆ 4,197 ఎకరాలతోపాటు హైదరాబాద్‌ నడిబోడ్డున ఉన్న 40 ఎకరాల భూమిని ఇచ్చేస్తామని చెప్పాయి. ఇది ప్రస్తుతం ఏపీ పరిస్థితి. ఇలాంటి దారుణమైన సంఘటనలు ఎక్కడా జరగవు.. ఒక్క ఏపీలో తప్ప. 9000 ఎకరాల భూమిని కేవలం రూ.482 కోట్లకే కొట్టేస్తుంటే, ఈ ప్రభుత్వం తనకేమీ పట్టనట్టు చూస్తూ ఉండిపోతోంది.'' అని టీడీపీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్‌ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.