TDP Leader Vangalapudi Anitha Comments on TTD Board Member: "రాజకీయ నిరుద్యోగులకు టీటీడీ బోర్డు నిలయంగా మారింది" - Vangalapudi Anita commens on Jagan

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 26, 2023, 7:47 PM IST

TDP Leader Vangalapudi Anitha Comments on TTD Board Members : సీఎం జగన్ నియమించిన టీటీడీ సభ్యులు జాతి రత్నాలని (TTD Trust Board with 24 Members) తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఎద్దేవా చేసారు. ఇలాంటి బోర్డు వేస్తే పులులు తరమడానికి కర్రలు ఇవ్వాలనే నిర్ణయాలే వస్తాయని విమర్శించారు. నడక మార్గంలో పులులు వస్తున్నాయి కాబట్టి నడక మార్గం మూసేసినా ఆశ్చర్యం పోనక్కర్లేదన్నారు. డబ్బు కోసం ఎంత వరకైనా వెళ్లే వ్యక్తులు టీటీడీ బోర్డులో ఉన్నారని ధ్వజమెత్తారు. లిక్కర్ డాన్ శరత్ చంద్రారెడ్డికి జైలు నుంచి రాగానే టీటీడీ బోర్డులో సభ్యత్వం ఇచ్చారని మండిపడ్డారు. విశ్వనాధ్ రెడ్డి అనే వ్యక్తి భారతీ రెడ్డి అనుచరుడని తెలిపారు. యెలహంక ప్యాలెస్ కాపలాదారుడికి టీటీడీ సభ్యత్యం ఇచ్చారని దుయ్యబట్టారు. సామినేని ఉదయభాను కొడుకు గంజాయి స్మగ్లింగులో పట్టుబడ్డాడని తెలిపారు. మద్యం తాగడం హానిరమని హెచ్చరిక వేస్తారు.. అలాంటి హానికరమైన మనుషులకు టీటీడీ బోర్డులో సభ్యత్వం ఇస్తారా? అని ప్రశ్నించారు. 

చాగంటి కోటేశ్వరరావుకు బోర్డులో సభ్యత్వం ఇచ్చినా దాన్ని ఆయన తిరస్కరించారన్నారు. జగన్ పరిపాలనలో వేసిన టీటీడీ బోర్డులో చాగంటి కొనసాగలేకపోయారని తెలిపారు. రాజకీయ నిరుద్యోగులకు తిరుమల కొండ వేదికగా మారిందన్నారు. రాజకీయ నిరుద్యోగులతో టీటీడీ బోర్డును నింపేస్తున్నారు. టీటీడీ పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత సీఎం జగన్​కు లేదా అని నిలదీశారు. క్రైస్తవుడైన భూమన కరుణాకర్ రెడ్డికి టీటీడీ ఛైర్మన్ (TTD Chairman Bhumana Karunakar Reddy)  పదవి ఇచ్చారని గగ్గోలు పెడుతున్నా సీఎం నిమ్మకు నీరెత్తినట్టున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  పవిత్రంగా భావించే తిరుమల తిరుపతి దేవస్థానం, అలాగే తిరుపతి కొండ  రాజకీయ వివాదాలకు, రాజకీయ నినాదాలకు నిలయంగా మారటం చాలా దురదృష్టకరమని వంగలపూడి అనిత పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.