శాశ్వత భూహక్కు చట్టం పేరుతో మంత్రి కాకాణి భారీ దోపిడీ: సోమిరెడ్డి - Somireddy comments
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 4, 2024, 6:50 PM IST
TDP leader Somireddy on Minister Kakani Robbery: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇటీవలే ప్రవేశపెట్టిన శాశ్వత భూహక్కు చట్టాన్ని అడ్డం పెట్టుకుని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి భారీ భూ దోపిడికి పాల్పడుతున్నారని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి ఆరోపించారు. శాశ్వత భూహక్కు చట్టం పేరుతో మంత్రి కాకాణి నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో తన బినామీలకు అడ్డగోలుగా భూములు రాసిచ్చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Somireddy Comments: మంత్రి కాకాణి భూదోపిడీపై నెల్లూరు టీడీపీ కార్యాలయంలో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ''నెల్లూరు జిల్లాలో భారీ కుంభకోణం జరిగింది. శాశ్వత భూహక్కు చట్టం పేరుతో మంత్రి కాకాణి దోపిడీ చేస్తున్నారు. అతని బినామీలకు అడ్డగోలుగా భూములు రాసిచ్చేశారు. అధికారుల అండదండలతో మంత్రి కాకాణి 5445 ఎకరాలు పంపిణీ చేశారు. గ్రామ సభలు పెట్టకుండానే అధికారులు ఎలా భూ పంపిణీ చేస్తారు? టీడీపీలో చేరేవారిపై రెవెన్యూ అధికారులతో దాడులు చేయిస్తున్నారు. తక్షణమే సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించిన భూముల జాబితాను బహిర్గతం చేయాలి. లేనిపక్షంలో కలెక్టరేట్‌ను ముట్టడిస్తాం'' అని సోమిరెడ్డి హెచ్చరించారు.