TDP leader Pattabhiram algeations on Minister: అక్రమ కేసులు పెట్టి భయపెట్టలేరు: పట్టాభిరాం - వైసీపీ వర్సెస్ పట్టాభిరాం
🎬 Watch Now: Feature Video
TDP leader Pattabhiram algeations: రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు రైతుల పట్ల అసభ్యకరంగా మాట్లాడారనే ఆరోపణలతో.. తనపై కేసు నమోదు చేశారని టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం వెల్లడించారు. రైతులను ఉద్దేశించి మంత్రి కారుమూరి మాట్లాడటంపై తప్పు అని ప్రశ్నించినందుకే .. తనపై తణుకులో తప్పుడు కేసులు బనాయించారని ఆరోపించారు. ఈ ప్రభుత్వం చేసే అరాచకాలను ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తున్నందుకు తనపై ఇప్పటివరకు 18 కేసులు పెట్టారని పట్టాభిరాం వెల్లడించారు. వాటన్నిటిని చట్టపరంగా ఎదుర్కొంటున్నామని ఆయన తెలిపారు.
అంతకు ముందుత తనకు తణుకు పోలీసులు 41A నోటీసు జారీ చేశారని పట్టాభి పేర్కొన్నారు. తనపై గతంలో అనేక సార్లు దాడులు జరిగాయని,ఆ దృష్ట్యా తనకు భద్రత లేనందున డీఐజీ ఆఫీస్కు వచ్చినట్లు తెలిపిన పట్టాభి తెలిపారు. ప్రజల సమస్యలపై ప్రశ్నిస్తే వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తుందని ఆరోపించారు. అక్రమ కేసులు పెట్టి భయపెట్టలేరన్న పట్టాభిరాం.. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ప్రజల పక్షాన పోరాటం చేస్తామన్నారు. డీఐజీ ని కలిసిన వారిలో టీడీపీ నేతలు ఏలూరు ఇన్చార్జి బడేటి రాధాకృష్ణ(చంటి)తో పాటు పలువురు నేతలు ఉన్నారు.