రాబోయే ఎన్నికల్లో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది : ఎంపీ రఘురామ - new year 2024
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/01-01-2024/640-480-20404042-thumbnail-16x9-tdp-leader-pattabhi-mp-raghurama-vist-shiridi.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 1, 2024, 5:24 PM IST
|Updated : Jan 1, 2024, 8:27 PM IST
TDP Leader Pattabhi MP Raghurama Vist Shiridi : నూతన సంవత్సరాన్ని పురష్కరించుకుని శిర్డీ సాయి ఆలయం భక్తుల కోలాహలంతో నిండిపోయింది. 2023 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ, కొత్త ఏడాదికి భక్తులు స్వాగతం పలికారు. నూతన సంవత్సర సందర్భంగా సాయి బాబాను దర్శించుకుంటే తమకు ఏడాదంతా మంచి జరుగుతుందనే నమ్మకంతో బాబా సన్నిధికి వచ్చినట్లు భక్తులు వివరించారు. ఈ నూతన సంవత్సరాన్ని పురష్కరించుకుని టీడీపీ నేత పట్టాభి, ఎంపీ రఘురామ కూడా సాయి దర్శనాన్ని చేసుకున్నారు.
నూతన సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తిరిగి మంచి రోజులు రావాలని సాయిని కోరుకున్నట్లు టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. 2024 సంవత్సరంలో టీడీపీ - జనసేన సంకీర్ణ ప్రభుత్వం ఆధికారంలోకి వచ్చి, చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని ఆయన ఆకాంక్షించారు. ఐదు సంవత్సరాల దుర్మార్గ పాలన అంతం కావాలని సాయిబాబాను వేడుకున్నట్లు వివరించారు. నూతన సంవత్సరంలో రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండాలని ఎంపీ రఘురామ కృష్ణరాజు ఆకాంక్షించారు. రానున్న ఎన్నికలో ప్రజల పార్టీ అద్భుతమైన విజయం సాధిస్తుందన్నారు.