మంగళగిరిలో దూకుడు పెంచిన నారా లోకేశ్ - ప్రముఖులతో భేటీ - Nara Lokesh

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 19, 2024, 6:56 AM IST

TDP Leader Nara Lokesh increased aggression in Mangalagiri: గుంటూరు జిల్లా మంగళగిరిని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఇన్నారు. అందు కోసం అన్నివర్గాలు కలసి రావాలని లోకేశ్ పిలుపునిచ్చారు. గత కొద్దిరోజులుగా నారా లోకేశ్ మంగళగిరిలోని ప్రముఖులతో వరుసగా భేటీ అవుతున్నారు. నియోజకవర్గంలోని సమస్యలు తీసుకోవాల్సిన చర్యలపై వారితో చర్చిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మంగళగిరికి చెందిన ప్రముఖులు పొట్టి గిరిజ, ప్రగడ రాజశేఖర్, తెంపల్లి రాఘవేంద్రరావుల ఇళ్లకు వెళ్లి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

వైద్యులుగా నిత్యం వందలాది మందికి సేవలందిస్తున్న గిరిజ, ఆదినారాయణలను లోకేశ్ అభినందించారు.  రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో వైద్యసేవలు విస్తృతం చేసేందుకు వారి సహకారం తీసుకుంటామని చెప్పారు. వీజే కళాశాల ఛైర్మన్ ప్రగడ రాజశేఖర్​తో సమావేశమైన లోకేశ్ విద్యారంగానికి  వీజే విద్యాసంస్థలు చేస్తున్న కృషిని కృషిని కొనియాడారు. విద్యా రంగంతో పాటు నూలు ఎగుమతులలోనూ తమ కుటుంబ సభ్యులు రాణిస్తున్నారని రాజశేఖర్ చెప్పారు. నేతన్నాలు, విద్యా సంస్థలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ప్రగడ రాజశేఖర్, లోకేశ్ దృష్టికి తీసుకొచ్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే చేనేత సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కృషిచేస్తానని లోకేశ్ హామీ ఇచ్చారు. అనంతరం విద్యుత్ గుత్తేదారు తెంపల్లి రాఘవేంద్రరావును ఆయన నివాసంలో కలుసుకున్నారు   

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.