వైసీపీ ఎమ్మెల్యే ప్రోత్సాహంతోనే నా భర్తను హత్య చేశారు - టీడీపీ నేత నందం సుబ్యయ్య భార్య ఆరోపణ - రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై ఆరోపణలు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/03-11-2023/640-480-19932865-thumbnail-16x9-tdp-leader-nandam-subbaiah-wife-on-ycp-mla.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 3, 2023, 5:37 PM IST
TDP Leader Nandam Subbaiah Wife on YCP MLA: వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో టీడీపీ నేత నందం సుబ్యయ్య హత్యపై ఆయన భార్య అపరాజిత కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి ప్రోత్సాహంతోనే బంగారు మునిరెడ్డి.. తన భర్తను దారుణంగా హత్య చేశారని ఆమె ఆరోపించారు. వారు చేసే దందాలు, భూ కబ్జాలు బయట పెడతారని భయంతోనే తన భర్తను చంపేశారని తెలిపారు. తన భర్తను చంపిన వాళ్లు జైల్లో ఉండాలని ప్రతిరోజూ ప్రార్థిస్తున్నానన్నారు.
నందం సుబ్బయ్య హత్య కేసులో నిందితుడిగా ఉన్న బెనర్జీ.. వైసీపీ నేతలతో ఎందుకు తిరుగుతున్నాడని ప్రశ్నించారు. నందం సుబ్బయ్యను చంపినట్టే చంపుతామంటూ పలువురిని బెనర్జీ బెదిరించారని ఆరోపించారు. ఇటీవల బెనర్జీపై దాడి జరిగితే ఆ ఘటనతో సంబంధం లేని టీడీపీ నేత ప్రవీణ్ కుమార్ రెడ్డిపై కేసు నమోదు చేయడం దారుణమన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందన్న అపరాజిత.. తన భర్తను చంపిన వాళ్లు జైలుకి వెళ్లడం ఖాయమన్నారు.