TDP Leader Nakka Anandbabu Wrote Letter to Mining Minister: రాష్ట్ర గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డికి.. నక్కా ఆనంద్ బాబు బహిరంగ లేఖ - Illegal Sand Excavations
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 27, 2023, 7:59 PM IST
TDP Leader Nakka Anandbabu Wrote Letter to Mining Minister: వైసీపీ ఇసుక మాఫియా వల్ల అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి 48 మంది ప్రాణాలు బలితీసుకున్నది వాస్తవం కాదా అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు నిలదీశారు. రాష్ట్ర గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డికి ఆయన బహిరంగ లేఖ రాశారు. ఇసుక దోపిడీపై టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన ప్రజెంటేషన్‌కు సమాధానం చెప్పకుండా వైసీపీ నేతలు ఎదురు దాడికి దిగుతున్నారని మండిపడ్డారు. టీడీపీ పాలనలో వెయ్యి రూపాయలకు లభించిన ట్రాక్టర్ ఇసుక.. వైసీపీ పాలనలో 5వేల రూపాయలకు పెరగటం వైసీపీ దోపిడీ పాపమేనని ధ్వజమెత్తారు. వైకుంఠపురం రీచ్‌లో అనుమతికి మించి ఇసుకను తవ్వారని కోర్టు కమిషన్ నిర్దారించింది వాస్తవమా? కాదా? అని ప్రశ్నించారు. దీనిపై సమాధానం చెప్పాలని అన్నారు. దాదాపు 500 రీచ్‌లలోని ఇసుకను అనుమతికి మించి అనధికారికంగా దోచేసి.. సుమారు 40వేల కోట్ల రూపాయల ధనాన్ని దోపిడీ చేసింది జగన్ రెడ్డి, పెద్దిరెడ్డి, జే గ్యాంగ్ అని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి ఇంటి సమీపంలో గుండుమేడకు ఈసీ లేకున్నా అక్కడ లక్షలాది టన్నుల ఇసుకను నిల్వ చేయటం నిబంధనల ఉల్లంఘన కాదా అని నిలదీశారు. టీడీపీ ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేయటం వల్ల మహిళా సంఘాలు, పంచాయతీలు నష్టాలను చవిచూసాయని అన్నారు. 40లక్షల మంది ఉపాధి కోల్పోయి.. 130మంది వరకు ప్రాణాలు కోల్పోయింది నిజం కాదా అని ప్రశ్నించారు. ఇసుక ధరలు పెంచటం వల్ల దానిపై ఆధారపడిన వృత్తులు, రంగాలు, వ్యాపారాలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.