TDP Leader Marreddy Srinivasa Reddy fire on minister Kakani : "రైతుభరోసా కేంద్రాలు వైసీపీ వారికి వరంగా.. రైతులకు శాపంగా మారాయి" - vijayawada latest news telugu
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 27, 2023, 11:37 AM IST
TDP Leader Marreddy Srinivasa Reddy fire on minister Kakani : అసెంబ్లీ సాక్షిగా రైతులు, వ్యవసాయంపై మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి చెప్పినవన్నీ కట్టుకథలేనని తెలుగురైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు.. రైతుభరోసా కేంద్రాలు వైసీపీ వారికి వరంగా.. రైతులకు శాపంగా మారాయని, ఇది నిజం కాదా? అని కాకాణిని ప్రశ్నించారు. విత్తనం నుంచి విక్రయం వరకు అండగా నిలుస్తుంది అని చెప్పిన రైతు భారోసా కేంద్రం ఏ గ్రామంలో అయిన ఆ కార్యక్రమాలు చేయడానికి కావలసిన వసతి ఉందా.. అని మండిపడ్డారు. అందులో నైపుణ్యం కలిగి సిబ్బంది పని చేస్తున్నారా..? అని అన్నారు. జగన్ రెడ్డి రైతులను ఉద్ధరించి వ్యవసాయాన్ని నిలబెడితే రైతులు, కౌలు రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రం, దేశంలో 2, 3 స్థానాల్లో ఎందుకుందని నిలదీశారు. వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడైనా ఒక్క ఎకరాకు అదనంగా నీరిచ్చారా అని ప్రశ్నించారు. రైతులకు ద్రోహం చేయాలన్న లక్ష్యంతో జగన్రెడ్డి ఇచ్చిన జీవో 22, జీవో 99, జీవో 464 సంగతి ఏమిటని ప్రశ్నించారు. కోర్టులో ఫైళ్లు కొట్టేసినప్పుడే తనను ఎవరూ ప్రశ్నించలేదన్న ధైర్యంతోనే కాకాణి అలవోకగా అసెంబ్లీలో అసత్యాలు చెప్పాడని శ్రీనివాసరెడ్డి విమర్శించారు.