దొంగే దొంగ అన్నట్టుగా పేర్ని నాని తీరు ఉంది - ఆయన అధికార దాహానికి అధికారులు బలి : కొల్లు రవీంద్ర - విశాఖ అగ్ని ప్రమాద బాధితులకు పరిహారం

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 26, 2023, 5:18 PM IST

TDP  Leader Kollu Ravindra Fire on Perni Nani: దొంగే దొంగ అన్నట్టుగా పేర్ని నాని తీరు ఉందని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. బందరు ఓట్ల అవకతవకలపై మాట్లాడిన ఆయన.. పేర్ని నాని అధికార దాహానికి అధికారులు బలైపోతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న విశాఖ ఫిషింగ్ హార్బర్ ఘటనపై పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని కొల్లు రవీంద్ర తేల్చిచెప్పారు. అగ్ని ప్రమాద బాధితులకు.. పవన్ కల్యాణ్ తన సొంత డబ్బులిచ్చారని, తెలుగుదేశం కూడా స్వచ్ఛందంగా ఆర్థికసాయం అందిస్తున్నామని గుర్తుచేశారు. 'మీ సొంత డబ్బులు ఒక్క రూపాయి అయినా ఇచ్చారా' అని సీఎం జగన్​ను ప్రశ్నించారు.

"దొంగే దొంగ అన్నట్టుగా పేర్ని నాని తీరు ఉంది. పేర్ని నాని అధికార దాహానికి అధికారులు బలైపోతున్నారు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న విశాఖ ఫిషింగ్ హార్బర్ ఘటనపై పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే. అగ్ని ప్రమాద బాధితులకు.. పవన్ కల్యాణ్ తన సొంత డబ్బులిచ్చారు. టీడీపీ కూడా స్వచ్ఛందంగా ఆర్థికసాయం అందిస్తోంది. సీఎం జగన్.. మీ సొంత డబ్బులు ఒక్క రూపాయి అయినా ఇచ్చారా..?" - కొల్లు రవీంద్ర, టీడీపీ మాజీ మంత్రి

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.