టీడీపీ నేతల యాత్రకు అడ్డంకులు - పోలీసులు, కార్యకర్తల మధ్య తోపులాట, ఉద్రిక్తత - టీడీపీ నేతల అరెస్టు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 5, 2023, 3:21 PM IST
TDP Leader Ganta Narahari Arrest: అన్నమయ్య జిల్లా రాజంపేటలో టీడీపీ నేత గంటా నరహరి చేపట్టిన అన్నమయ్య డ్యాం వరద బాధితుల పరామర్శ యాత్ర తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. గంటా నరహరిని పోలీసులు అరెస్టు చేశారు. పట్టణంలోని గంటా నరహరి కార్యాలయం నుంచి పులుపుత్తూరు, మందపల్లి గ్రామాలకు అన్నమయ్య డ్యాం వరద బాధితులను పరామర్శించేందుకు గంటా సరహరి సిద్ధమయ్యారు. దీంతో గత రాత్రి నుంచి పోలీసులు వారిని ఎక్కడికీ వెళ్లనీయకుండా ఆయన ఇంటివద్ద కాపలా ఉన్నారు.
Rajampet TDP MP Candidate Ganta Narahari: అయితే ఈ రోజు ఉదయం తన కార్యాలయం నుంచి వరద బాధిత గ్రామాలను సందర్శించడానికి వెళ్తున్న గంటా నరహరి బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, టీడీపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరగటంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పట్టణ సీఐ నరసింహారావు ఆధ్వర్యంలో పోలీసులు.. టీడీపీ నాయకులు.. గంటా నరహరి, రూరల్ అధ్యక్షుడు గన్నె సుబ్బ నరసయ్య, టీడీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని.. పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు.