TDP Leader Butchaiah Chowdary Protest Against CBN Arrest: 'బాబు కోసం మేము సైతం..' రాజమహేంద్రవరంలో టీడీపీ వినూత్న నిరసన - ఏపీ వార్తలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 6, 2023, 4:14 PM IST
TDP Leader Butchaiah Chowdary Protest Against CBN Arrest : తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ.. రాజమహేంద్రవరంలో పార్టీ సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి స్థానిక రోడ్లను చీపుర్లతో ఊడ్చి నిరసన తెలిపారు. బాబుకోసం నేను సైతం అంటూ పెద్ద ఎత్తున ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలతో హోరెత్తించారు. తమ నేత నారా లోకేశ్, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కలిసి భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తారని, నియంత పాలన కొనసాగిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని బుచ్చయ్య చౌదరి హెచ్చరించారు.
TDP Leaders Fire On CM Jagan : నారా లోకేశ్ వెంట విజయవాడ నుంచి రాజమండ్రి వెళ్తున్న తమను అడ్డుకోవడంపై మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర, దేవినేని ఉమామహేశ్వర రావు పోలీసులపై మండిపడ్డారు. ఇదెక్కడి రాజ్యాంగం జగన్ రెడ్డీ అని ప్రశ్నించారు. తమ నాయకుడి వెంట వెళుతుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని నిలదీశారు. బారికేడ్లు పెట్టి నిర్బంధించాలని ప్రయత్నిస్తున్నారా అని ప్రశ్నించారు. మరీ ఇంత పిరికివాడవా జగన్ రెడ్డి అని ఆక్షేపించారు. తమ నాయకుడిని చూస్తుంటే వైసీపీ నాయకులకి భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు.
Amaravati Farmers Reached Rajamahendravaram : లోకేశ్ రాజమహేంద్రవరం వస్తున్న సందర్భంగా అభిమానులు, టీడీపీ శ్రేణులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అమరావతి నుంచి రైతులు రెండు బస్సుల్లో రాజమహేంద్రవరం చేరుకున్నారు. అమరావతి రైతులు నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. నారా భువనేశ్వరిని కలిసి మద్దతు తెలిపారు.