"ఐదు పైసల అవినీతిని నిరూపించలేకపోయారు - పొన్నవోలు సుధాకర్ రాజకీయాలు ఆపాలి" - Advocate Sidharth Luthra

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 18, 2024, 1:16 PM IST

TDP Leader Bonda Uma Fire On Advocate Ponnavolu Sudhakar Reddy : తెలుగుదేశం ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ నాయకులు ఐదు సంవత్సరాల్లో 5 పైసల అవినీతిని కూడా నిరూపించలేకపోయారని, రాష్ట్ర ప్రభుత్వ అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ ఇకనైనా రాజకీయాలు ఆపాలని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు అన్నారు. 17ఏ మీద క్యాష్ పిటిషన్ వేశామన్న ఉమా, ప్రభుత్వం అడ్వకేట్లను పెట్టి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృథా చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వపు డొల్లతనం ఒక్కొక్కటిగా బయటపడుతోందని ఆక్షేపించారు.

నాకు ఉద్యోగం ఇచ్చిన వారి కోసం ప్రాణమిచ్చి పనిచేస్తున్నా : స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తరఫున వాదిస్తున్న సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా (Advocate Sidharth Luthra) కూలి కోసం పని చేస్తున్నారని పొన్నవోలు సుధాకర్‌రెడ్డి అన్నారు. ఈ ఉద్యోగంలోకి తనను తీసుకున్న వారి కోసం తాను కమిట్‌మెంట్‌తో, ప్రాణం ఇచ్చి పని చేస్తున్నాని ఆయన వ్యాఖ్యానించారు. నెల్లూరు నగరంలోని ఓ ప్రైవేటు హోటల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏఏజీగా ఉంటూ విలేకరుల సమావేశం పెట్టడం నిబంధనలకు విరుద్ధమని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయని ప్రశ్నించగా "మంత్రసానితనం ఒప్పుకొన్నాక, బిడ్డ వచ్చినా పట్టుకోవాలి, మరేది వచ్చినా పట్టుకోవాలి"అని ఆయన సమాధానం ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.