Bonda Uma Comments on Jagan: ముందస్తు ఎన్నికల కోసమే దిల్లీకి జగన్: బొండా ఉమా - సీఎం జగన్పై బొండా ఉమా విమర్శలు
🎬 Watch Now: Feature Video
Bonda Uma Comments on Jagan: ముందస్తు ఎన్నికల కోసమే జగన్మోహన్ రెడ్డి మరోసారి దిల్లీ వెళ్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు తెలిపారు. ఈ నాలుగున్నరేళ్లలో సీఎం జగన్ ప్రజలకు ఏం మంచి చేశారో చెప్పగలరా అని ప్రశ్నించారు. కరకట్టపై లింగమనేని రమేష్ ఇంటికి అనుమతులు ఇచ్చింది ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డేనని ఆయన గుర్తుచేశారు. సీఎంలు మారగానే సక్రమమైన కట్టడాలు అన్నీ.. అక్రమ కట్టడాలు అవుతాయా అంటూ మండిపడ్డారు. ప్రతిపక్ష నేతకు ఇల్లు, కార్యాలయం కల్పించాల్సింది ప్రభుత్వమేనన్నారు. ప్రజావేదిక అడిగినా సీఎం ఇవ్వకుండా కూల్చారని బోండా ఉమా మండిపడ్డారు. జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో అన్ని అలవెన్సులు ఇచ్చామన్నారు. సీఎం జగన్ రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని అన్నారు. జగన్ కక్షసాధింపు చర్యలకు త్వరలోనే ప్రజలు చరమగీతం పాడుతారని హెచ్చరించారు. మంత్రి జోగి రమేష్ ఒక తాగుబోతన్న బొండా ఉమా.. పెడనలో రోజూ తాగి వాలంటీర్లను వేధిస్తున్నాడని ఆరోపించారు.