ఎలక్ట్రికల్ హైడ్రో పవర్ ప్రాజెక్టుకు అనుమతి ఎందుకిచ్చారో సీఎం జగన్ చెప్పి కేక్ కట్ చేయాలి: టీడీపీ నేత అయ్యన్న - ఏపీ లేటెస్ట్ న్యూస్
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 21, 2023, 5:40 PM IST
TDP Leader Ayyanna on Power Plant: జగన్‌రెడ్డి నాలుగున్నరేళ్ల పాలనలో గిరిజనుల కోసం ఏం చేశారో చెప్పాలని టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. గిరిజనులంతా వ్యతిరేకిస్తున్నా ఎలక్ట్రికల్ హైడ్రో పవర్ ప్రాజెక్టుకు అనుమతి ఎందుకిచ్చారో జగన్ పుట్టిన రోజు కేక్ కట్ చేసేముందు సమాధానం చెప్పాలన్నారు. గిరిజనులకు పరిష్కార మార్గం చూపకుండా ప్రాజెక్టు నిర్మాణం ఎలా చేపడతారని అయ్యన్న ధ్వజమెత్తారు. ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేయటం వల్ల కొండ ప్రాంతం నుంచి నీరు కిందకి రాదు. దీంతో 53వేల ఎకరాల భూమి ఎడారిగా మారిపోతుంది. గిరిజనులను సీఎం జగన్ మోసం చేస్తున్నారని అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు.
"నాలుగున్నరేళ్ల పాలనలో గిరిజనుల కోసం జగన్‌రెడ్డి ఏం చేశారో చెప్పాలి. గిరిజనులంతా వ్యతిరేకిస్తున్నా ఎలక్ట్రికల్ హైడ్రో పవర్ ప్రాజెక్టుకు అనుమతి ఎందుకిచ్చారో బర్త్ డే కేక్ కట్ చేసేముందు సీఎం జగన్ చెప్పాలి. గిరిజనులకు పరిష్కార మార్గం చూపకుండా ప్రాజెక్టు నిర్మాణం ఎలా చేపడతారు." - అయ్యన్నపాత్రుడు, టీడీపీ సీనియర్ నేత