జగన్ పుట్టినరోజు వేడుకలకు ₹100 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం: టీడీపీ నేత అచ్చెన్న
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 22, 2023, 4:39 PM IST
TDP Leader Achenna on Jagan Birthday Celebrations: జగన్ పుట్టినరోజు వేడుకలకు 100 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేశారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. ప్రజాధనంతో వేడుకలు చేసుకోవడం జగన్ రెడ్డి రాచరిక పోకడలకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగా ఏం సాధించారని జగన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. వేతనం పెంచమని అంగన్వాడీలు సమ్మె చేస్తుంటే సీఎం జగన్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రి ఫ్లెక్సీలను విద్యార్థులు ప్రదర్శించాలని ఆదేశాలివ్వడం సిగ్గుచేటని దుయ్యబట్టారు.
"జగన్ పుట్టినరోజు వేడుకలకు 100 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేశారు. ప్రజాధనంతో వేడుకలు చేసుకోవడం జగన్ రెడ్డి రాచరిక పోకడలకు నిదర్శనం. ముఖ్యమంత్రిగా ఏం సాధించారని జగన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు చేసుకుంటున్నారు. వేతనం పెంచమని అంగన్వాడీలు సమ్మె చేస్తుంటే సీఎం జగన్ ఎందుకు స్పందించడం లేదు. సీఎం జగన్ ఫ్లెక్సీలను విద్యార్థులు ప్రదర్శించాలని అధికారులు ఆదేశాలివ్వడం సిగ్గుచేటు." - అచ్చెన్నాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు