TDP Leader Achanta Sunitha కేంద్రం ఇచ్చే నిధులతో.. డ్వాక్రా మహిళలను ఉద్ధరించామని చెప్పుకుంటున్నారు..! - about Dwakra groups intrest
🎬 Watch Now: Feature Video
TDP Leader Achanta Sunitha Comments: డ్వాక్రా మహిళలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే వడ్డీని తానిస్తున్నట్లుగా జగన్ చెప్పుకుంటున్నారని, తెలుగునాడు అంగన్వాడీ, డ్వాక్రా సాధికార కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత ధ్వజమెత్తారు. అప్పులపాలైన డ్వాక్రా మహిళలను ఉద్ధరించామని చెప్పుకోవడం అబద్ధమని ఆమె ఆరోపించారు. సీఎం జగన్ తాను సంక్షేమం కోసమే 1లక్షా 50 వేల కోట్లు ఖర్చు పెట్టామనడం హాస్యాస్పదంగా ఉందని ఆచంట సునీత ఎద్దేవా చేశారు. జగన్ ప్రభుత్వం సుమారు రూ. 7లక్షల 50 వేల కోట్లకు పైగా అప్పు చేసిందని ఆరోపించారు.
డ్వాక్రా మహిళల్ని ప్రపంచ పటంలో చూపిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని సునీత స్పష్టం చేశారు. కో ఆపరేటివ్ సొసైటీ(కెడీసీసీ) బ్యాంకుల్లో రుణం తీసుకున్నవారికి సున్నా వడ్డీ రుణం రాదనటం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ తన పాదయాత్ర సందర్భంగా... డ్వాక్రా మహిళలకు రూ. 10 లక్షల వరకు రణాలు ఇస్తానని హామీ ఇచ్చాడన్న సునీత... సీఎం జగన్ ఆ హామీలను అమలు చేయడం లేదని ఆరోపించారు. జగన్ తాను సున్నా వడ్డికే రుణాలు ఇస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారని ఆమె పేర్కొంది. గతంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో రూ. 5 లక్షలు ఇచ్చే సున్నా వడ్డీ రుణాల్ని సైతం తగ్గించి, కేవలం రూ. 3 లక్షలు మాత్రమే ఇస్తున్నారని సునీత మండిపడ్డారు.