పరిశ్రమల ఏర్పాటుతో కడపలో వలసలను తగ్గిస్తాం- మైనారిటీల ఆత్మీయ సమావేశంలో టీడీపీ నేత నరహరి - రాజంపేట నియోజకవర్గం లేటెస్ట్ న్యూస్
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17-12-2023/640-480-20290309-thumbnail-16x9-tdp-ganta-narahari-meeting-with-muslim-minorities.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 17, 2023, 6:53 PM IST
|Updated : Dec 17, 2023, 7:29 PM IST
TDP Ganta Narahari Meeting with Muslim Minorities: రాజంపేట నియోజకవర్గంలో వందకు పైగా సూక్ష్మ, చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసి వలసలను నివారిస్తామని టీడీపీ నేత నరహరి పేర్కొన్నారు. రాజంపేటలో ముస్లిం మైనారిటీలతో భారీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడే నమాజ్ కూడా నిర్వహించి వారితో ఆత్మీయంగా మాట్లాడారు. నియోజకవర్గంలో వేలమంది గల్ఫ్ బాట పడుతున్నారని టీడీపీ అధికారంలోకి రాగానే వారంతా ఈ ప్రాంతానికి తిరిగి వచ్చేవిధంగా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. పరిశ్రమలతో మైనారిటీల్లో ఉపాధి సౌకర్యాలను పెంచుతామని నరహరి చెప్పారు.
వైఎస్సార్సీపీ ప్రభుత్వం ముస్లింలను పట్టించుకోవడంలేదని, గతంలో టీడీపీ అమలు చేసిన పథకాలను జగన్ సర్కార్ రద్దు చేసిందని ఆయన మండిపడ్డారు. అన్నమయ్య ప్రాజెక్టు కుంగిపోయి రెండేళ్లు దాటినా వైఎస్సార్సీపీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని విమర్శించారు. వైఎస్సార్సీపీ పాలనతో విసిగిపోయిన ముస్లిం మైనార్టీలంతా వచ్చే ఎన్నికల్లో టీడీపీని అఖండ మెజారిటీతో గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాజంపేట అసెంబ్లీ పార్లమెంటు అభ్యర్థులను ఎవరిని బరిలో నిలిపినా గెలిపించుకునేందుకు సాయశక్తులా కృషి చేస్తామని గంటా నరహరి స్పష్టం చేశారు. ముస్లిం మైనార్టీలంతా తెలుగుదేశం పార్టీకి అండగా ఉండాలని చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గంట నరహరి కోరారు.