TDP Dhulipalla Narendra Kumar Arrest: స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాల పరిశీలనను అడ్డుకున్న పోలీసులు.. పలువురి అరెస్ట్ - నేత ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్ పై టీడీపీ
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 26, 2023, 5:27 PM IST
TDP Dhulipalla Narendra Kumar Arrest: గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలో ఉన్న నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని పరిశీలించేందుకు వెళ్లిన తెలుగుదేశం శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రం పరిశీలనకు తమకు అనుమతి ఇవ్వాలని టీడీపీ శ్రేణులు సోమవారం యూనివర్సిటీ రిజిస్టార్కు వినతిపత్రం అందజేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం కేంద్రాన్ని పరిశీలించినందుకు వస్తున్న.. తెలుగుదేశం శ్రేణులకు అనుమతి లేదంటూ పోలీసులు వారిని బలవంతంగా.. తరలించే ప్రయత్నం చేశారు.
నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని పరిశీలించేందుకు వెళ్తున్న తెలుగుదేశం నేత ధూళిపాళ్ల నరేంద్రను పోలీసులు పొన్నూరు మండలం చింతలపూడిలో అదుపులోకి తీసుకున్నారు. వడ్లమూడిలోని విజ్ఞాన్ వర్సిటీ వద్ద నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రం పరిశీలనకు వెళ్తారని ముందస్తు సమాచారంతో ఆయన ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఉదయం నుంచి ధూళిపాళ్లను గృహనిర్బంధం చేశారు. అయితే నరేంద్ర ఇంటి నుంచి బయటకు రాగానే పోలీసులు అదుపులోకి తీసుకుని పొన్నూరు స్టేషన్‌కు తరలించారు. మరోవైపు విజ్ఞాన్ యూనివర్సిటీ వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు.