Dundi Rakesh: "జగన్ ప్రభుత్వం.. వ్యాపారుల నుంచి కోట్ల రూపాయలు దండుకుంది": డూండీ రాకేశ్ - Jay Tax
🎬 Watch Now: Feature Video
Dundi Rakesh Fires on CM Jagan: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యాపారుల నుంచి లక్షల కోట్ల రూపాయలు దోచుకుందని టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు డూండీ రాకేశ్ ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. జే టాక్స్‌ల పేరుతో 32 వేల కోట్ల రూపాయలు వ్యాపారుల నుంచి దండుకుందన్నారు. జగన్ దోపిడిని, అక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు.. ‘వ్యాపారుల నుంచి కొట్టేసిన కమీషన్లతో తాడేపల్లి ప్యాలెస్ ఫుల్ – వ్యాపారుల జేబులకు చిల్లు’ పేరుతో కరపత్రాలు ముద్రించినట్లు వివరించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని శాశ్వతంగా తాడేపల్లి ప్యాలెస్‌కు పరిమితం చేయటమే.. వ్యాపార వర్గాల ధ్యేయమన్నారు. జగన్ నాలుగేళ్ల పాలన.. వ్యాపార, వాణిజ్యవర్గాలకు చీకటి పాలనగా ఉందని అభివర్ణించారు. కరోనా లాంటి భయంకర పరిస్థితుల్లో కూడా వ్యాపారులను వదలకుండా పీక్కుతిన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని వాళ్ల వ్యాపారులు 45వేల కోట్ల రూపాయల వరకు నష్టపోయారని ఆరోపించారు. జగన్ దోపిడి తట్టుకోలేక నాలుగు సంవత్సరాలలో 400మంది వ్యాపారులు బలవన్మరణాలకు పాల్పడ్డారని డూండీ రాకేశ్ మండిపడ్డారు.