TDP Chief Chandrababu Selfie Challenge at Thotapalli Project: తోటపల్లి ప్రాజెక్టు వద్ద చంద్రబాబు సెల్ఫీ ఛాలెంజ్ - TDP Chief Chandrababu selfie challenge news
🎬 Watch Now: Feature Video
TDP Chief Chandrababu Selfie Challenge at Thotapalli Project: 'సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి' పర్యటనలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి సెల్ఫీ ఛాలెంజ్‌లు విసురుతున్నారు. టీడీపీ హయాంలో తీసుకువచ్చిన ప్రాజెక్టులను సందర్శిస్తున్న చంద్రబాబు.. జగన్ ప్రభుత్వం వచ్చాక ప్రాజెక్టులన్నీ నిర్వీర్యమయ్యాయని దుయ్యబడుతున్నారు. నేడు ఉమ్మడి విజయనగరం జిల్లాలో పర్యటించిన చంద్రబాబు.. పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలంలో ఉన్న సర్దార్ గౌతు లచ్చన్న తోటపల్లి ప్రాజెక్టును సందర్శించారు. అనంతరం తోటపల్లి ప్రాజెక్టు వద్ద సెల్ఫీ దిగిన చంద్రబాబు.. జగన్ ప్రభుత్వానికి ఛాలెంజ్ విసిరారు.
Chandrababu fire on YSRCP leaders: అధికారంలోకి వచ్చాక వదిలిపెట్టను.. పార్వతీపురం పట్టణ ప్రజలు చంద్రబాబు రాక కోసం బారులు తీరారు. సాయంత్రం నాలుగు గంటలకే సభా వేదిక వద్దకు చేరుకున్నారు. చంద్రబాబు బహిరంగ సభకు జిల్లా నలువైపులా నుంచి పార్టీ కార్యకర్తలు, యువత, మహిళలు భారీ ఎత్తున తరలిరావడంతో పార్వతీపురం పట్టణమంతా పసుపుమయంగా మారింది. చంద్రబాబు నాయుడు విచ్చేస్తుండగా సభ నినాదాలతో హోరెత్తిపోయింది. సభలో గిరిజనుల సమస్యలను తెలుసుకున్న చంద్రబాబు.. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీని చిత్తు చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక.. ప్రజలకు అన్యాయం చేసిన వైఎస్సార్సీపీ నాయకులను వదిలిపెట్టనంటూ చంద్రబాబు నాయుడు హెచ్చరించారు.