గన్నవరం విమానాశ్రయంలో బాబుకు ఘనస్వాగతం పలికిన అభిమానులు - cbn latest news

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 1, 2023, 4:47 PM IST

TDP Chief Chandra Babu Grand Welcome in Gannavaram Airport: తిరుపతి నుంచి విజయవాడ చేరుకున్న తెలుగుదేశం అధినేత(TDP Chief) చంద్రబాబుకు  ఘన స్వాగతం లభించింది. గన్నవరం విమానాశ్రయంలో  తెలుగుదేశం నాయకులు, అభిమానులు  సాదర స్వాగతం పలికారు.  భారీ వాహన ర్యాలీతో చంద్రబాబు కాన్వాయ్ వెంబడి శ్రేణులు వెళ్తున్నాయి.

Fans Gathered in Large Numbers: బాబు కోసం ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి అభిమానాన్ని చాటుకున్నారు. తెలుగుదేశం శ్రేణులతో విమానాశ్రయ పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి.  గన్నవరం విమానాశ్రయం, జాతీయ రహదారి పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించారు. అనుమతి లేదంటూ శ్రేణుల్ని నిలువరించేందుకు పోలీసులు యత్నించినా ఫలితం లేకపోయింది. చంద్రబాబు వాహనశ్రేణి వెంబడి యువకులు బైక్ ర్యాలీతో మద్దతు పలికారు. ఉండవల్లిలోని తన నివాసానికి చంద్రబాబు బయలుదేరి వెళ్లారు. కాసేపట్లో పార్టీ ఎంపీలు, ముఖ్య నేతలతో చంద్రబాబు పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించనున్నారు. నియోజకవర్గం మొత్తం భారీగా పూల వర్షం తో చంద్రబాబు కు ఘన స్వగతం లభించింది. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.