Bonda Uma On Farmers Issue సీఎం తాడేపల్లి గడప దాటరు.. మంత్రులు రైతులను బూతులు తిడతారు: బొండా ఉమా - టీడీపీ నేత బోండా ఉమ
🎬 Watch Now: Feature Video
TDP Leader Bonda Uma: రైతుల ఆత్మహత్యల్లో ఏపి అగ్ర స్థానంలో నిలిచిందని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా మహేశ్వరరావు విమర్శించారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక రైతుల గొంతు కోశారన్నారు. వ్యవసాయానికి ఇన్సూరెన్స్ లేక రైతులు నష్ట పోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. సీఎం తాడేపల్లి దాటి అడుగు ముందుకు వేయడం లేదన్న బోండా ఉమా... వ్యవసాయ శాఖా మంత్రి అయితే పత్తా లేకుండా పోయాడని మండిపడ్డారు. అధికారులు పంట నష్టంపై అంచనాలు కూడా వేయడం లేదన్నారు. మంత్రి కారుమురి సొంత నియోజకవర్గంలో రైతులకు న్యాయం చేయాలని అడిగితే బూతులు తిట్టారని దుయ్యబట్టారు. వెర్రిపప్ప కారుమూరి నోరు అదుపులో పెట్టుకోవాలని బోండా ఉమామహేశ్వరరావు హెచ్చరించారు.
ముఖ్యమంత్రి తాడేపల్లి గడప దాటట్లేదు..కనీసం వ్యవసాయ శాఖా మంత్రి అయినా రైతులకు అండగా నిలబడతాడు, తడిసిన ధాన్యాన్ని కొనమంటాడు అన్ రైతులంతా ఆశగా చూసినా.. ప్రభుత్వం నుంచి ఒక్క అధికారి వెళ్లటం కానీ, మంత్రి వెళ్లటం కానీ, ఫీల్డ్ విజిట్ చేయడం కానీ..అసలు నష్టంపై అంచనాలు వేయడం కానీ..రాష్ట్రంలో ఎక్కడా జరగలేదు. -బోండా ఉమామహేశ్వరరావు, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు.