TDP Ayyannapatrudu on CBN Arrest చంద్రబాబు అరెస్ట్‌పై కేంద్రం స్పందించాల్సిన అవసరం ఉంది: టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు - అనకాపల్లి జిల్లా లేటెస్ట్ న్యూస్
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 9, 2023, 7:35 PM IST
TDP Ayyannapatrudu on CBN Arrest తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌పై తక్షణమే కేంద్రం స్పందించాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు. సైకో పాలన శాశ్వతం కాదని రాష్ట్రంలోని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు దీనిపై స్పందించాల్సిన అవసరం ఉందని అన్నారు.
"ఎఫ్ఐఆర్లో చంద్రబాబు పేరు లేకపోయినా ఆయనను అరెస్టు చేయటం చాలా అన్యాయం. జగన్ లాంటి సైకోను ఇప్పటివరకు నేను ఎక్కడా చూడలేదు. జగన్ లాంటి దుర్మార్గులకు పోలీసు అధికారులు సహకరిస్తున్నారు. జైలులో ఉండి వచ్చిన జగన్.. చంద్రబాబుపై కూడా మచ్చ తేవాలనే ఉద్దేశంతో అరెస్టుకు పాల్పడ్డారు. చంద్రబాబు ఇప్పటివరకూ ఎలాంటి మచ్చ లేకుండా బతికారు. ఆయనను ఎవరూ ఏం చేయలేరు. రాష్ట్రంలో జరుగుతున్న ఈ అరాచకాలపై కేంద్రం స్పందించాలని కోరుతున్నాము. ఏపీలో సైకో జగన్ పాలన శాశ్వతం కాదు. రాష్ట్రంలోని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు దీనిపై స్పందించాల్సిన అవసరం ఉంది." - అయ్యన్నపాత్రుడు, టీడీపీ మాజీ మంత్రి