TDP Activist Death Due to Heart Attack : చంద్రబాబు అరెస్టుపై ఆందోళన.. గుండెపోటుతో టీడీపీ సీనియర్ కార్యకర్త మృతి - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 25, 2023, 12:08 PM IST
TDP Activist Death Due to Heart Attack : స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో మాజీముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు అక్రమంగా అరెస్టయి జైలులోనే ఉండటంతో మనస్థాపానికి గురై ఆందోళనలో ఉన్న తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త బుడాన్ సాబ్ గుండెపోటుతో మృతి చెందాడు. శ్రీసత్య సాయి జిల్లా తనకల్లు మండలం కొర్తికోటకు చెందిన బుడాన్ సాబ్ టీడీపీ వీరాభిమాని. పార్టీ అధినేతను కుట్రపూరితంగా అరెస్టు చేసి15 రోజులు దాటినా జైలులోనే ఉండటాన్ని జీర్ణించుకోలేని బుడాన్ సాబ్ ఒక్కసారిగా కుప్పకూలి పోయాడు. గుర్తించిన కుటుంబ సభ్యులు తనకల్లు ఆసుపత్రికి తరలించారు. కానీ, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. బుడాన్ సాబ్ మృతి విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇంఛార్జి కందికుంట వెంకట ప్రసాద్ మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి ప్రకటించారు. మృతుడి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందన్నారు. బుడాన్ సాబ్ మృతి పార్టీకి తీరని లోటు అని నాయకులు అన్నారు.