అడ్డుగా ఉన్నాననే తొలగించారు.. ప్రాణభయం ఉంది : ఎమ్మెల్యే శ్రీదేవి - ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఇంటర్వ్యూ వీడియో
🎬 Watch Now: Feature Video
MLA UNDAVALLI SRIDEVI: ప్రాణ భయంతోనే విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్లిపోయినట్లు వైకాపా నుంచి బహిష్కరణకు గురైన ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కన్నా ముందు నుంచే తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ....దుష్ప్రచారం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తన కార్యాలయంపై వైసీపీ గూండాలు ఇష్టారీతిన దాడులు చేశారని.. తాను చేసిన తప్పేంటో చెప్పకుండా వేధింపులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని ప్రాంతంలో ఇసుక దందాలు, మైనింగ్ దోపిడీలు చేశారని విమర్శించారు. వాళ్ల దందాలకు అడ్డు వస్తాననే తనపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అక్రమాలు చేయబోనని తెలిసి తనని తొలగించాలని చూశారని విమర్శించారు. తాను ఏమైనా మాఫియా డాన్‌నా అజ్ఞాతంలోకి వెళ్లడానికి? అని శ్రీదేవి ప్రశ్నించారు. గతంలో డా.సుధాకర్, డా.అచ్చన్న ఎలా చనిపోయారనేది తనకు తెలుసన్న శ్రీదేవి.. రేపు వారిలా డా. శ్రీదేవి కూడా చనిపోకూడదనే వెళ్లిపోయినట్లు పేర్కొన్నారు.
అమరావతి మట్టి సాక్షిగా అక్కడ రాజధాని కోసం జరుగుతున్న పోరాటానికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందించడంతోపాటు తాను పాల్గొంటానని చెబుతున్నఉండవల్లి శ్రీదేవితో మా ఈటీవీ ప్రతినిధి తిరుపాల్ రెడ్డి ముఖాముఖి..