అమరావతి రాజధాని పిటిషన్ల విచారణ - ఏప్రిల్‌కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు - జస్టిస్ దీపాంకర దత్తా
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/03-01-2024/640-480-20423043-thumbnail-16x9-supreme-court-on-amaravati-capital.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 3, 2024, 10:31 PM IST
Supreme Court on Amaravati Capital: అమరావతి రాజధాని పిటిషన్ల విచారణను సుప్రీం కోర్టు ఏప్రిల్‌కు వాయిదా వేసింది. ఏప్రిల్‌లో సుదీర్ఘంగా వాదనలు విన్న తరువాతే తదుపరి నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఏపీ ప్రభుత్వం తరఫున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. మూడు రాజధానుల చట్టాలను ఉపసంహరించుకున్నా, హైకోర్టు తీర్పు ఇవ్వడం సమంజసం కాదని వాదించారు. ఈ కేసులో ఇంకా ప్రతివాదుల నుంచి లిఖితపూర్వక అఫిడవిట్‌లు దాఖలు చేయడం పూర్తి కాలేదని, రైతుల తరఫున సీనియర్ న్యాయవాది దేవదత్ కామత్ వాదనలు వినిపించారు. నాలుగు వారాల్లోగా అఫిడవిట్‌లు, కౌంటర్ అఫిడవిట్‌లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ ధర్మాసనం విచారణను వాయిదా వేసింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర దత్తాతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. అమరావతే ఆంధ్రప్రదేశ్‌కి రాజధాని అని నిర్మాణం పూర్తి చేయాలని, సమయంతో కూడిన షరతులతో గతంలో ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేసింది.