సీఎం జగన్ అక్రమాస్తుల కేసు విచారణలో ఆలస్యం ఎందుకు? - రఘురామ పిటిషన్‌పై సీబీఐకి సుప్రీం నోటీసులు - Raghurama case against Jagan
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 3, 2023, 1:36 PM IST
Supreme Court Notices to CBI on Jagan Illegal Assets Case Petition: జగన్ అక్రమాస్తుల కేసుపై రఘురామ వేసిన పిటిషన్‌పై సీబీఐకి సుప్రీకోర్టు నోటీసులు జారీ చేసింది. పిటిషన్‌పై తదుపరి విచారణ వచ్చే జనవరికి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. సీఎం జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు విచారణ ఎందుకు ఆలస్యం అవుతుందో చెప్పాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎంపీ రఘురామ కృష్ణ రాజు వేసిన పిటిషన్‌ను ఎందుకు విచారించకూడదో చెప్పాలని ప్రశ్నించింది.
ముఖ్యమంత్రి జగన్, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సహా మిగతా ప్రతివాదులకు సుప్రీం నోటీసులు జారీ చేసింది. అలాగే అరబిందో గ్రూప్ కంపెనీలు, హెటిరో గ్రూప్ కంపెనీలకు నోటీసులు ఇచ్చింది. ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్, ఎం.శ్రీనివాస్‌రెడ్డి, కె.నిత్యానందరెడ్డికి, పి.శరత్‌చంద్రారెడ్డి, బి.పి.ఆచార్య, యద్దనపూడి విజయలక్ష్మి ప్రసాద్, పి.ఎస్.చంద్రమౌళి, జగతి పబ్లికేషన్స్, జనని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థకు నోటీసులు జారీ చేసింది. జగన్ అక్రమాస్తుల కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేయాలన్న రఘురామ పిటిషన్‌పై తదుపరి విచారణను సుప్రీంకోర్టు జనవరికి వాయిదా వేసింది.