వైభవంగా సుబ్రహ్మణ్య స్వామి కావడి ఉత్సవాలు - కేరళ వాయిద్యాలు, నృత్యాలు హోరు - district update news
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16-12-2023/640-480-20282082-thumbnail-16x9-kavadi-festival-east-godavari.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 16, 2023, 3:42 PM IST
Subrahmanyeshwar Swamy Kavadi Festivals in East Godavari : తూర్పుగోదావరి జిల్లాలో శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠిని పురస్కరించుకుని కావడి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనపర్తి గ్రామంలో వీర్రాజు మామిడి వద్ద కొలువైన స్వామికి ఆలయ అర్చకులు ఉదయమే ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణమంతా స్వామి వారి నామ స్మరణతో మార్మోగిపోయింది. అనంతరం సుబ్రహ్మణ్య మాలధారులు కావడిని భుజాన ధరించి పేటతుళ్లి ఆడుతూ గ్రామోత్సవం నిర్వహించారు. కేరళ డప్పువాయిద్యాలు, కోలాట నృత్యాల నడుమ అశ్వరథంలో స్వామి భక్తులకు దర్శనం ఇచ్చారు. కావడి ఉత్సవాలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో మహిళలు, భక్తులు తరలివచ్చారు.
Faith of Devotees : సుబ్రహ్మణ్య స్వామికి కావడి ఉత్సవాలను నిర్వహించడం ఇది పదోవసారని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఏటా అత్యంత ఘనంగా కావడి ఉత్సవాలను నిర్వహిస్తామని తెలిపారు. ఈ ఉత్సవాలకు భక్తుల అందరూ వచ్చి స్వామి వారిని దర్శించుకోవాలని కోరుకున్నారు.