Students Missing From Tribal Gurukula School: నలుగురు విద్యార్థుల అదృశ్యంపై ఆలస్యంగా కేసు నమోదు.. ప్రిన్సిపల్‌కు మెమో జారీ - AP Latest News
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/27-09-2023/640-480-19617967-thumbnail-16x9-students-missing.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 27, 2023, 12:11 PM IST
Students Missing From Tribal Gurukula School: నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం సున్నిపెంటలోని ప్రభుత్వ గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థుల అదృశ్యంపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. పదో తరగతి విద్యార్థులు నలుగురు ఈ నెల 20వ తేదీ నుంచి కనిపించకుండా పోయారని పాఠశాల ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్ రెడ్డప్ప పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాఠశాల నుంచి వెళ్లిపోయిన విద్యార్థులు ఆత్మకూరు, నందికొట్కూరు, పత్తికొండ, ఆదోని ప్రాంతాలకు చెందినవారుగా తెలిసింది. సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. విద్యార్థులు స్థానికంగా కొన్ని వ్యసనాలకు గురై పాఠశాల నుంచి బయటకు వెళ్లిపోయినట్లు ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్ చెబుతున్నారు. వారం రోజుల నుంచి విద్యార్థుల ఆచూకీ తెలుసుకొని తిరిగి రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రిన్సిపల్ రెడ్డప్ప తెలిపారు. నలుగురు విద్యార్థులు పాఠశాల వదిలి వెళ్లడంపై ఉన్నతాధికారులకు, శ్రీశైలం రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ప్రిన్సిపల్ తెలిపారు. విద్యార్థులు కనిపించకుండా పోయిన విషయాన్ని తమ దృష్టికి తీసుకురాకపోవడంపై శ్రీశైలం ఐటీడీఏ పీవో రవీంద్రారెడ్డి ప్రిన్సిపల్‌కు మెమో జారీ చేశారు.