Students Meets CM Jagan: క్యాంపు ఆఫీస్లో సీఎంను కలిసిన.. విద్యార్థులు బృందం - గుంటూరు జిల్లా తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 10, 2023, 12:21 PM IST
Students Meets CM Jagan: ప్రభుత్వం తరఫున ఇటీవల అమెరికాలో పర్యటించిన విద్యార్థుల బృందం.. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను సోమవారం కలిసింది. ముందుగా విద్యార్థులను.. వారి తల్లిదండ్రులను పరిచయం చేసుకున్న సీఎం.. వారి అమెరికా పర్యటన ఎలా జరిగిందంటూ పిల్లలను అడిగి తెలుసుకున్నారు. ఆణిముత్యాలు కార్యక్రమంలో భాగంగా.. పదోతరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులలో 126 మందిని గుర్తించి.. వారికి పోటీపరీక్ష నిర్వహించినట్లు అధికారులు ముఖ్యమంత్రికి జగన్కు తెలిపారు. పోటీపరీక్షతో పాటు వారి భాషా పరిజ్ఞానాన్ని కూడా పరిశీలించి.. 126 మందిలో చివరకు 10మంది విద్యార్థులను ఎంపిక చేసి అమెరికాకు పంపినట్లు అధికారులు సీఎంకి జగన్తో పేర్కొన్నారు. ప్రభుత్వ సంస్థల్లో చదివే విద్యార్థులకు GRE, జీమ్యాట్ పరీక్షలను ఉచితంగా అందుబాటులోకి తీసుకురావాలని సీఎం జగన్ ఆదేశించారు. వీటికి సంబంధించి మెటీరియల్, శిక్షణను విద్యార్థులకు అందించాలన్నారు. అమెరికా పర్యటనకు వెళ్లిన విద్యార్థులకు మార్గనిర్దేశం చేయటానికి ఒక ఐపీఎస్ అధికారిని నియమించాలని సూచించారు.