'నెగెటివ్ ఆలోచనలు వేధిస్తున్నాయి' - బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య - SRIT college anantapur district
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/19-12-2023/640-480-20302494-thumbnail-16x9-student-suicide.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 19, 2023, 12:30 PM IST
Student Suicide in Anantapur District : అనంతపురం జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి చెందిన ఎస్ఆర్ఐటీ కళాశాలలో ఓ విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపింది. కళాశాలలో ఈసీఈ రెండో సంవత్సరం చదువుతున్న కవిత అనే విద్యార్థిని వసతి గృహంలో ఉరివేసుకొని ఆత్యహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు ముందు రాసిన లేఖను విడుదల చేశారు. నెగెటివ్ ఆలోచనలతో ఇబ్బందులు పడుతూ బలవన్మరణానికి పాల్పడినట్లు లేఖలో కవిత పేర్కొనట్లు తెలిపారు. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Demand of Student Unions : కళాశాల యాజమాన్యం కవిత తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండానే మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారని విద్యార్థి సంఘాలు తెలిపాయి. విద్యార్థిని చనిపోయిన ముందు రాసిన లేఖ పోలీసు అధికారులు వద్ద లేదని, కళాశాల యాజమాన్యం దాచిపెట్టిందని ఆరోపించాయి.కవిత ఆత్మహత్యపై సమగ్ర విచారణ జరిపించాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. పోలీసులు కళాశాల యాజమాన్యానికి అనుగుణంగా నడుచుకున్నట్లు ఆరోపించారు.