కస్తూర్బా విద్యార్థిని మృతి - శోక సంద్రంలో తల్లిదండ్రులు - Parents Lost a Daughter
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 15, 2023, 4:50 PM IST
Student Death in Annamayya District : అన్నమయ్య జిల్లాలో నిమ్మనపల్లి మండలంలో విషాదం చోటుచేసుకుంది. స్థానిక కస్తూర్బా పాఠశాలలో చదువుతున్న ఓ విద్యార్థిని రక్తపు వాంతులు చేసుకుని మరణించింది. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం కొలమాసనపల్లికి చెందిన స్వాతి నిమ్మనపల్లి కస్తూరి పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. గురువారం అకస్మాతుగా స్వాతి రక్తపు వాంతులు చేసుకుంది. దీంతో పాఠశాల సిబ్బంది స్వాతి తల్లిదండ్రులకు సమాచారం అందించి మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సిబ్బంది సమాచారంతో స్వాతి తల్లిదండ్రులు హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. రక్తపు మడుగులో ఉన్న తమ బిడ్డను చూసి బోరున విలపించారు.
Parents Lost a Daughter : చికిత్సానంతరం తమ కుమారై ఆరోగ్యంగా ఉంటుందని తల్లిదండ్రులు భావిస్తే చివరికి నిరాశే మిగిలింది. చికిత్స పొందుతూ గురువారం రాత్రి స్వాతి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. విగత జీవిగా మారిన తమ కుమారైను చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అయ్యారు. ఈ విషయం ఆసుపత్రిలో ఉన్న వారి మనసు కలిచివేసింది.