Student Attack on Principal: పరీక్షల్లో డీబార్.. ప్రిన్సిపల్‌పై బ్లేడ్‌తో విద్యార్థి దాడి.. - Student Attack on college principal in Giddalur
🎬 Watch Now: Feature Video
Student Attack on College Principal : తనను పరీక్షలు రాయనీయకుండా డీబార్ చేయించాడని ప్రిన్సిపల్‌పై ఓ విద్యార్థి దారుణానికి ఒడిగట్టాడు. ఏకంగా ప్రిన్సిపల్‌ను హత్య చేసేందుకు యత్నించాడు. దానికి తగ్గట్లు ప్రణాళిక రచించుకుని ఒక్కసారిగా ప్రిన్సిపల్‌పై దాడికి దిగాడు. అప్రమత్తమైన ప్రిన్సిపల్ తప్పించుకున్నాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
గిద్దలూరు పట్టణంలోని సాహితీ జూనియర్ కళాశాలలో పబ్లిక్ పరీక్షలు రాసేందుకు ఇంటర్ విద్యార్థి హాజరయ్యాడు. పరీక్ష రాసే సమయంలో కాపియింగ్ చేసేందుకు యత్నించగా స్క్వాడ్ సిబ్బంది గుర్తించి డీబార్ చేశారు. అది అవమానంగా భావించి మనసులో పెట్టుకున్న విద్యార్థి.. దానికి కారణం ప్రిన్సిపలే అని భావించాడు. అతని వల్లే తన భవిష్యత్ నాశనం అయ్యిందని కోపం పెంచుకున్నాడు. ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని పన్నాగం పన్నాడు. ప్రిన్సిపల్‌పై దాడి చేసేందుకు నిర్ణయించుకున్నాడు. ఇక అంతే పక్కా ప్రణాళికను రచించాడు.
గురువారం సాహితీ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ కొండారెడ్డి గొంతును బ్లేడుతో కోసేందుకు ప్రయత్నం చేశాడు. అప్రమత్తమైన కొండారెడ్డి తన కుడి చేతిని అడ్డుపెట్టాడు. ఈ దాడిలో గొంతుకు, చేతికి గాయాలయ్యాయి. అది గమనించిన స్థానికులు కొండారెడ్డిని దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స అందించిన వైద్యులు ప్రాణాపాయం తప్పిందని చెప్పారు. విషయం తెలుసుకున్న పోలీసులు దాడికి పాల్పడ్డ విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే అసుపత్రికి వెళ్లి ప్రిన్సిపల్‌ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.