STs Protest Against MLA: పాతపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే శాంతికి నిరసన సెగ - పాతపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే శాంతికి నిరసన సెగ
🎬 Watch Now: Feature Video
STs Protest Against MLA Reddy Shanthi: శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం మెలియాపుట్టి మండలం జన్నిబంద గ్రామంలో ఎమ్మెల్యే శాంతికి నిరసన సెగ తగిలింది. శనివారం మండలంలోని పలు గ్రామాల్లో గడపగడప కు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఎమ్మెల్యే శాంతి వెళ్లారు. జోడూరు రాజపురం గ్రామాల్లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం జన్నిబందు గ్రామానికి వెళ్లగా స్థానిక గిరిజనుల నుంచి ఎమ్మెల్యేకు నిరసన సెగ తగిలింది. గ్రామస్తులు ఎమ్మెల్యేని అడ్డుకున్నారు. బోయ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు తీర్మానించడం వలన మాలాంటి గిరిజనులకు ఎంతో అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనులకు అన్యాయం చేసిన మీరు మా గ్రామాలకు ఎందుకు వస్తున్నారని అడ్డుకొని నిరసన తెలియజేశారు. అలాగే సమీపంలో ఉన్న అర్చనాపురం గ్రామం ప్రజలు రహదారికి అడ్డుగా రహదారికి అడ్డుగా కర్రలు వేసి ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ బోర్డులు పెట్టారు. దీంతో ఆ గ్రామంలోకి వెళ్లకుండానే ఎమ్మెల్యే రెడ్డి శాంతి వెనుదిరిగారు.