Stock Market Cheating: స్టాక్ మార్కెట్లో లాభాలు అంటూ.. డబ్బులతో ఉడాయించాడు - stock market fraud in visakhapatnam
🎬 Watch Now: Feature Video
Stock Market Cheating: స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే అధిక లాభం పొందవచ్చని పలువురి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి ఓ వ్యక్తి పరారైన ఘటన విశాఖలో చోటు చేసుకుంది. జార్ఖండ్‌కు చెందిన రాహుల్ సింగ్ ఈక్విటీ నాక్స్ పేరిట విశాఖ సత్యం కూడలిలో కార్యాలయాన్ని ఏర్పాటు చేశాడు. బీఎస్ఐ గ్రూపులో సభ్యత్వం తీసుకుని పలువురితో పరిచయాలు పెంచుకున్నాడు. దీంతో వారికి స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం వల్ల అధిక లాభాలు పొందవచ్చని నమ్మించాడు. వీరిలో కొందరు లక్ష నుంచి 20 లక్షల రూపాయల వరకూ పెట్టుబడులు పెట్టారు. వీరికి కొంతకాలం వరకు వడ్డీ రూపంలో చెల్లింపులు చేశాడు. తర్వాత నిలిపివేయటంతో బాధితులు గట్టిగా ప్రశ్నించారు. కొన్ని రోజుల నుంచి అతను కార్యాలయం తెరవడం లేదు. ఇంటిని సైతం ఖాళీ చేసి వెళ్లిపోవటంతో.. ఏం చేయాలో తెలియక బాధితులు పోలీసులను ఆశ్రయించారు. సుమారు 19 మంది బాధితులు ఫిర్యాదు ఇచ్చారు. మోసపోయిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలుస్తోంది. ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు న్యాయపరమైన సలహాలు తీసుకుని, చర్యలు తీసుకుంటామని చెప్పారు.