కులగణన చేపడతామన్న మంత్రి - రజకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్

🎬 Watch Now: Feature Video

thumbnail

Delimitation Process In Next Month tells venugopala krishna: డిసెంబర్ 9 నుంచి రాష్ట్రంలో కులగణన చేపడుతున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ చెప్పారు. గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న మైదానంలో రజకులు నిర్వహించిన ఆత్మగౌరవ మహాసభకు మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మేరుగు నాగార్జున, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎన్జీవో ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, ప్రముఖ గాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోరేటి వెంకన్న తన పాటలతో అలరించారు.

రజకులకు రాజ్యాధికారం కావాలని,పెన్షన్ ఇవ్వాలని, ఉచితంగా ఆరోగ్య సేవలు అందించాలని, తమ కులాన్ని ఎస్సీ జాబితాలో చేర్చాలని ఆ సామాజిక వర్గ రాష్ట్ర అధ్యక్షుడు అంజిబాబు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కులగణన పూర్తయిన తర్వాత సామాజిక వర్గాల వారీగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని, రాజకీయంగా అవకాశాలు కల్పిస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాలకృష్ణ తెలిపారు. రజకుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని మంత్రి మేరుగు నాగార్జున హామీ ఇచ్చారు. రజకులను వీలైనంత తొందరగా ఎస్సీ జాబితాలో చేర్చాలని సీబీఐ పూర్వ జేడీ లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.