బకాయిలు చెల్లించాలని సమ్మె చేస్తే అక్రమ కేసులు బనాయించారు : కార్మికులు - anantapur district
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/18-01-2024/640-480-20540971-thumbnail-16x9-workers-strike.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 18, 2024, 8:37 PM IST
Sriram Reddy Drinking Water Scheme Workers Protest : తమపై అక్రమంగా బనాయించిన క్రిమినల్ కేసులు ఎత్తివేసి, తమకు రావలిసిన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ శ్రీరాం రెడ్డి తాగునీటి పథకం కార్మికులు అనంతపురంలో ఆందోళనకు దిగారు. అయిదు నెలలుగా వేతనాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలు చెల్లించాలంటూ శాంతియుతంగా సమ్మె చేస్తున్న తమపై అక్రమంగా కేసులు పెట్టారని కార్మికులు వాపోయారు.
నీటిపారుదల శాఖ అధికారులు, వైసీపీ నాయకులు కలిసి పంప్ హౌస్ మోటర్లు ఆన్ చేయటం వల్ల పైపులు పగిలిపోయాయని వివరించారు. వారిపై చర్యలు తీసుకోకుండా ఏ మాత్రం సంబంధం లేని కార్మికులపై అక్రమంగా కేసులు బనాయించడం ఏంటని నిలదీశారు. ఆందోళన చేస్తున్న కార్మికులకు వేతనాలు విడుదల చేయాల్సిన ప్రభుత్వం తమపై తప్పుడు కేసులు పెట్టి బెదిరింపులకు దిగుతోందని మండిపడ్డారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఆర్డబ్ల్యుఎస్ కార్యాలయం ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.