'వస్తున్నాయ్.. వస్తున్నాయ్.. పవన్నామా రథ చక్రాలు..' జనసేన ప్రత్యేక గీతం - janasena song
🎬 Watch Now: Feature Video
Janasena Special Song : జనసేన పార్టీ ప్రత్యేక గీతాన్ని రూపొందించి విడుదల చేసింది. కేవలం పాటనే కాకుండా జనసేన నిర్వహించిన ప్రతి కార్యక్రమాన్ని చూపిస్తూ వీడియోను తయారు చేసి.. పాటకు జత చేశారు. సోమవారం పార్టీ ఆ గీతాన్ని విడుదల చేసింది. మార్చి 14వ తేదీన మచిలీపట్నంలో నిర్వహించనున్న సభ కోసం ఈ పాటను ప్రత్యేకంగా రూపొందించారు. ఆవిర్భావ సభకు పవన్ కల్యాణ్ మంగళగిరిలోని పార్టీ కార్యాలయం నుంచి మచిలీపట్నం వరకు వారాహిలో చేరుకుంటారు. అందువల్ల వారాహి నేపథ్యం ఉండే విధంగా పాటకు ప్రాణం పోశారు.
రాష్ట్రంలో ప్రభుత్వ వైఫల్యాలు, అధికార పార్టీ నేతల అరాచకాలు, వైసీపీ సర్కారు తీరుతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలియజేసేలా గీతాన్ని మలిచారు. పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి ప్రజల కోసం పోరాడిన ప్రతి అంశాన్ని పాటలో నిక్షిప్తం చేశారు. ప్రతి దృశ్యాన్ని పాటకు జత చేసిన వీడియోలో చూపించారు. ఇప్పటంలో ప్రభుత్వ కూల్చివేతలు, పలు కారణాలతో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ఓదార్చిన దృశ్యాలను గీతంలో పొందుపరిచారు.