'విద్యుత్ ఛార్జీల పెంపుదలను డిస్కంలు ప్రతిపాదించలేదు' - విద్యుత్తు టారిఫ్ ప్రతిపాదనలపై ప్రజాభిప్రాయ సేకరణ
🎬 Watch Now: Feature Video
AP ERC Chairman Interview: రాష్ట్రంలో విద్యుత్తు ఛార్జీల పెంపుదలను డిస్కంలు ప్రతిపాదించలేదని విద్యుత్తు నియంత్రణ మండలి ఛైర్మన్ జస్టిస్ సి.వి.నాగార్జున రెడ్డి వెల్లడించారు. వినియోగదారునిపై ఏ రూపంలోనూ భారం కాకుండా చూడాలన్నదే తమ ఉద్దేశ్యమని అన్నారు. విద్యుత్ పంపిణీలో నాణ్యమైన సేవలు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కరెంట్ సరపరా సేవలను అమలు చేసేలా విద్యుత్తు పంపిణీ సంస్ధలకు ఆదేశాలిస్తున్నామని వివరించారు. మూడు రోజుల పాటు విశాఖ నుంచి విద్యుత్తు టారిఫ్ ప్రతిపాదనలపై ఈఆర్సీ సభ్యులతో కలిసి వీడియో కాన్ఫెరెన్స్ విధానం ద్వారా బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ జరిపిన నాగార్జున రెడ్డితో ఈటీవీ-ఈనాడు ప్రత్యేక ముఖాముఖి.
ఇవీ చదవండి: